హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి డిసెంబర్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం ఖాయమని తేలిపోవడంతో సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా డిసెంబర్ 5న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకు రెండు రోజుల ముందుగానే డిసెంబర్ 3న కేసీర్ ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం.




