హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తోందంటే ఎవరి దయాదాక్షిణ్యాల మీద కాదని ఎన్నో త్యాగాలు, పోరాటాలతోనే ఇస్తోందనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెరాస శాసనసభపక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. దీక్షా దివన్‌ను పురస్కరించుకుని కరీంనగర్‌లో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త నాటకాలను తెరలేపుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో పాటు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.




