Tuesday, 3 November 2026

బిగ్‌బాన్‌ పై పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌: ఓ హిందీ ఛానల్‌ ప్రసారమవుతున్న రియాలిటీ షో బిగ్‌బాన్‌ను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ముస్లింల సెంటిమెంట్లు దెబ్బతినేలా ఈ రియాలిటీ షోను ప్రసారం చేస్తున్నారంటూ పిటిషనర్‌ చేసిన వాదనల్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కల్యాణ్‌ జోతి సేన్‌ గుప్తా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. ముందుగా ఈ వ్యవహారాన్ని సంబంధిత సెన్సార్‌ బోర్డు, ప్రసారాలను సమీక్షించే హోంశాఖ దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదంటూ పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఫిర్యాదు చేసిన అనంతరం సదరు అధికారులు చర్య తీసుకోనట్లయితే కోర్టును ఆశ్రయించాలని పిటిషర్‌కు సూచిస్తూ న్యాయస్థానం వ్యాజ్యాన్ని కొట్టివేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *