హైదరాబాద్: రవాణా పన్ను ఎగవేస్తూ బియ్యం, పత్తిని 8 లారీల్లో రాష్ట్ర సరిహద్దు దాటిస్తున్న లారీలను పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ ఎన్‌పోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. మెదక్ జిల్లా జహీరాబాద్ ఆర్టీఏ చెక్‌పోస్టు సమీపంలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు దాడులు నిర్వహించి నాలుగు లారీల్లో రూ. 18లక్షల విలువైన 680 క్వింటాళ్ల బియ్యం, మరో నాలుగు లారీల్లో రూ. 18లక్షల విలువైన 438 క్విటాళ్ల పత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విజిలెన్స్ సీఐ సత్యన్న తెలిపారు.




