హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలని ఏఐసీసీకి లేఖ రాసినట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు అహంకార పూరితమైనవని అన్నారు. జేసీ వేరే పార్టీలోకి వెళ్లవచ్చని, ఎవరూ కాళ్లు పట్టుకుని ఆపలేదన్నారు. సోనియాను విమర్శిస్తే పెద్ద వ్యక్తి అవుతామనుకుంటే పొరపాటని, సొంత పార్టీపై కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాసం పెట్టడం సమంజసం కాదని బొత్స పేర్కొన్నారు.




