Tuesday, 3 November 2026

లోక్‌సభలో సమైక్యాంధ్ర నినాదాలు

హైదరాబాద్‌: సమైక్యాంధ్ర నినాదాలతో లోక్‌ సభ దద్ధరిల్లింది. సీమాంధ్రకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ తెదేపా ఎంపీలు నినాదాలు చేశారు. ప్లకార్డులతో స్పీకర్‌ వెల్‌లోకి దూసుకెళ్లి సభాకార్యక్రమాలకు అడ్డుతగిలారు. లోక్‌ సభ ప్రారంభమైన వెంటనే పార్లమెంట్‌ దాడి ఘటనలో గృతి చెందిన జవాన్లకు సభ నివాళులర్పించింది. అనంతరం స్పీకర్‌ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. భాజపా లోక్‌ సభాపక్ష నేత సుష్మాస్వరాజ్‌ మాట్లాడుతూ …లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్‌ గంగూలీ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. జస్టిస్‌ గంగూలీ వెంటనే రాజీనామా చేయాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ కోరింది. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతున్నప్పటటికీ సీమాంధ్ర ఎంపీలు తమ ఆందోళనలనను విరమించకపోవడంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *