మైలవరం: ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి శ్రీశైలం వెళ్తున్న శివ భక్తుల కారు కృష్ణా జిల్లా మైలవరం దర్గా సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో భద్రాచలానికి చెందిన రామారావు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




