హైదరాబాద్: తిరుమలలో సాంకేతిక లోపంతో కంప్యూటర్లు పనిచేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కంప్యూటర్లు మొరాయించడంతో గంట నుంచి దివ్యదర్శనం, ఆర్జిత సేవ, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, గదుల కేటాయింపు సేవలు నిలిచిపోయాయి. మూడు రోజుల వ్యవధిలో రెండోసారి సర్వర్లు మొరాయించడంతో భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.




