Wednesday, 4 November 2026

తొలి నుంచీ సమైక్య వాదినే : కేంద్రమంత్రి కావూరి

హైదరాబాద్‌: తాను తొలి నుంచీ సమైక్య వాదినేనని, పదవి వచ్చినంత మాత్రాన అభిప్రాయం మారిపోతుందని అనుకోవడం పొరపాటని కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…గత వారం చింతలపూడిలో కొంత మంది తనపై వ్యతిరేకంగా చర్యలు చేపట్టారని, వారు కూడా మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌ పురికొల్పిన వ్యక్తులే తప్ప సమైక్యవాదులు కాదన్నారు. ఎన్జీవోలు చేస్తున్న ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. కేంద్రంపై సీమాంధ్ర ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం వల్ల ప్రయోజనం లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *