Wednesday, 4 November 2026

రానున్న ఎన్నికల్లో తెదేపాదే విజయం : కేఈ కృష్ణమూర్తి

హైదరాబాద్‌: రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీదే విజయమని తెదేపా సీనియర్‌ నేత కేఈ కృష్ణమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నూలు పాతనగరంలో నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ప్రభుత్వం వ్యతిరేకతను తప్పించుకోవడానికి కాంగ్రెస్‌, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు వైకాపా ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *