Tuesday, 3 November 2026

ప్రజలు సర్కారు ఏర్పాటు చేయమన్నారు

ఆప్‌ నాయకుడు కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 22 (జనంసాక్షి) :
ఢిల్లీ ప్రజలు తమను ప్రభుత్వం ఏర్పాటు చేయమంటున్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. న్యూఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయాన్ని తమ పార్టీ రేపు ఉదయం వెల్లడిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఉదయం కేజ్రీవాల్‌ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటుపై తమ పార్టీలో నిరంతరాయంగా చర్చల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఆ చర్చల ప్రక్రియ నేటిసాయంత్రనానికి ఓ కొలిక్కి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అమలు చేసేందుకు మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. అందుకోసం పలువురు నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ ఏర్పాటుపై హస్తిన ప్రజలను వచ్చిన ప్రతి ఒక్క విజ్ఞప్తిని తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటులో ఆమ్‌ ఆద్మీ పార్టీ డోలయామానంలో ఉందన్న మాజీ ఐపీఎస్‌ అధికారి, హక్కుల కార్యకర్త కిరణ్‌బేడీ వ్యాఖ్యలను ఈ సందర్భంగా విలేకర్లు ప్రస్తావించారు. ఆమె వ్యాఖ్యలకు కాలమే సమాధానం చెబుతుందని కేజ్రీవాల్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *