హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నేతలు అందరం కలిసి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వినతిపత్రం ఇచ్చినట్లు కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతరావు తెలిపారు. రాష్ట్రపతితో భేటఅ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతితో తాను, జానారెడ్డి, దామోదర రాజనర్సింహలు మాట్లాడతామని తెలిపారు. ముఖ్యమంత్రి బిల్లును ఓడిస్తామని ప్రకటనలు చేస్తున్నారని వివరించినట్లు చెప్పారు. జీమాంధ్ర ప్రాంతానికి ఏం కావాలో అక్కడి నాయకులు అడిగితే బాగుంటుందని అన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డా… అశోక్ బాబా అంటూ ప్రశ్నించారు.




