హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి గంటా శ్రీనావవాసరావు కుమార్తె వివాహం ఇవాళ విశాఖపట్నంలో జరిగింది. గంటా కుమార్తె సాయి పూజితకు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు కుమారుడు వెంకటరామ్ ప్రశాంత్‌తో జరిగిన వివాహానికి సీఎం కిరణ్, తెదేపా అధినేత చంద్రబాబు, కేంద్ర మంత్రి చిరంజీవితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇవాళ ఉదయం విశాఖలోని ఆంధ్రాయూనివర్శిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఈ వివాహం జరిగింది. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, రాష్ట్ర మంత్రులు గల్లా అరుణకుమారి, దానం నాగేందర్, టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, బాలరాజు, తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.




