Tuesday, 3 November 2026

జంటనగరాల్లో వైభవంగా క్రిస్మస్‌ వేడుకలు

హైదరాబాద్‌ : జంటనగరాల్లో క్రిస్మస్‌ వేడుకులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రాజధాని హైదరాబాద్‌ సహా సికింద్రాబాద్‌లోని చర్చిలన్నీ క్రైస్తవ సోదరులతో కిటకిటలాడాయి. ఈతెల్లవారుజామున నుంచే క్రైస్తవులు పెద్ద సంఖ్యలో చర్చిలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. భక్తిశ్రద్ధలతో ఏసు క్రీస్తు గీతాలు ఆలపిస్తున్నారు. సికింద్రాబాద్‌ సెయింట్‌ మేరీస్‌ చర్చిలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి శంకర్‌ రావు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఖైరతాబాద్‌లోని చింతల్‌ బస్తీ, తదితర చర్చిలకు భక్తులు కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. దీంతో ఆయా ప్రాంగణాలన్నీ సందడిగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *