హైదరాబాద్ : మరణం తర్వాత… పదిమందికి జీవితాన్నిచ్చే అవయవాలు దానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అహోబిలం శ్రీనివాసరామానుజన్ జీయర్ పిలుపు నిచ్చారు. అవయవదానం పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ శ్రీకాకుళం లో శ్రీనివాసరామానుజన్ జీయర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. డేఅండ్‌నైట్ కూడలి నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు నిర్వహించిన ర్యాలీలో వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




