హైదరాబాద్ : కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని మల్యాల హంద్రీనీవా ఎత్తిపోతల పథకం వద్ద ఎంపీ ఎస్సీవై రెడ్డి, రైతులు, రైతు సంఘం నాయకులు హంద్రీనివా మోటార్లను బంద్ చేయించారు. ఈ సందర్భంగా ఎస్సీవై రెడ్డి మాట్లాడుతూ…ఇప్పుడు కేసీ కాల్వకు నీరు ఇవ్వకపోతే చివరి దశలో ఉన్న వరి, పత్తి, శనగ పంటలకు నష్టం వాటిల్లుతుందన్నారు. రైతు సంఘం నాయకులు జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ… కేసీ కాలువకు నీరు వదిలే వరకు మోటర్లను ఆన్ చేయమని ఇక్కడే బైఠాయిస్తామన్నారు. కేసీ కాలువకు మార్చి 31 వరకు నీరు ఇవ్వాలని కోరారు.




