Tuesday, 3 November 2026

సొంతింటి ఆవరణలో కారు దూసుకెళ్లి సర్పంచ్‌ మృతి

ఆదిలాబాద్‌, బేల : ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం బెదోడ పంచాయతీ సర్పంచ్‌ మాధురి(35) ఆదివారం దుర్మరణం పాలయ్యారు. మాధురి ఇంటి ఆవరణలో కూర్చుని ఉండగా అక్కడే నిలిపి ఉన్న కారును బంధువైన ఒక వ్యక్తి నడిపేందుకు ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తూ కారు అదుపు తప్పి మాధురిపైకి దూసుకుకొచ్చింది. ఈ ప్రమాదంలో మాధురి అక్కడికక్కడే మృతి చెందగా బంధువుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడు ఆదిలాబాద్‌ రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *