Tuesday, 3 November 2026

విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతోందని రాష్ట్రపతికి చెప్పాం : సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీలు

హైదరాబాద్‌ : ఎన్నికల ముందు ఇలాంటి బిల్లులు తీసుకురావడం సరైందికాదని రాష్ట్రపతికి చెప్పామని, విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతోందని తెలిపామని సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీలు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఆపాలని రాష్ట్రపతిని కోరామన్నారు. సీమాంధ్ర క్గాంఎస్‌ ఎంపీలు ఐదుగురు ఈ రోజు హైదరాబాదులో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిశారు. ఎంపీలు రాయపాటి సాంబశివరావు, హర్షకుమార్‌, లగడపాటి రాజగోపాల్‌, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మైనారిలీలో ఉందని రాష్ట్రపతికిచ్చిన నివేదికలో వారు పేర్కొన్నారు. అవిశ్వాసానికి మద్దతుగా 70 మంది ఎంపీల మద్దతున్నా పార్లమెంటు వాయిదా వేశారని, తృణమూల్‌, డీఎంకే, ఎంఐఎం ఇప్పటికే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాయని వారు గుర్తు చేశారు. నాలుగు నెలల క్రితమే తాము స్పీకర్‌కు రాజీనామాలు ఇచ్చామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *