Tuesday, 3 November 2026

బెంగాలీ నటి సుచిత్రా సేన్‌ ఆరోగ్యం విషమం

కోల్‌కతా : ప్రసిద్ధ బెంగాలీ నటి సుచిత్రా సేన్‌ ఆరోగ్య పరిస్థితి గా ఉంది. శ్వాస నాళం ఇన్‌ఫుక్షన్‌ తో బాధపడుతున్న ఆమెను వైద్యులు ఐసీయూకి తరలించారు. 82 ఏళ్ల సుచిత్రా సేన్‌ కోల్‌కతాలో ఒంటరిగా నివసిస్తున్నారు. అనారోగ్యం వార్త తెలిసి కుమార్తె మూన్‌మూన్‌ సేన్‌, మనవరాలు రైమా సేన్‌ కోల్‌కతా చేరుకున్నారు. క్లాసిక్‌ బెంగాలీ చిత్రాలుగా పేర్కొనే పటు చిత్రాల్లో సుచిత్ర నటించారు.దేవదాసు చిత్రంలో నటనకు ఉత్తమనటి అవార్డు అందుకున్నారు. హిందీలో ఆమె ఇందిరాగాంధీ జీవిత కథ ను పోలిన ‘ఆంధీ’ అనే చిత్రంలో నటించారు. అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డుపొందిన తొలి బెంగాలీ నటి ఆమె. సప్తపది అనే చిత్రానికి గాను మాస్కో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో ఉత్తమ నటి అవార్డు లభించింది. 2005 లో దాదా సాహెబ్‌ ఫాల్కే ఆవార్డును సుచిత్ర తిరస్కరించినట్లు సమాచారం. కోల్‌కతా ప్రభుత్వం ఆమెను ‘వంగ విభేషణ్‌’ అవార్డుతో సత్కరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *