రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు : డీఎస్
హైదరాబాద్, డిసెంబర్ 30 (జనంసాక్షి) :
రాష్ట్రం ఇక సమైక్యంగా ఉండే ముచ్చటేలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలు మాత్రం ఎట్టిపరిస్థితిల్లోనూ సమైక్య రాష్ట్రంలో జరిగే అవకాశాలు లేనేలేవని, రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగడం ఖాయమని డీఎస్ పేర్కొన్నారు. ఆయన సోమవారం ఉదయం బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీని కలిసి సుమారు గంట సేపు చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 1956 నుంచి కూడా తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రం తమకు కావాలని కోరుకుంటూనే ఉన్నారన్నారు. ఆనాటి నుంచి నేటివరకు కూడా తెలంగాణ ప్రజలు ప్రత్యేక పరిపాలనను కోరుకుంటుంటే సీమాంధ్రులు మాత్రం ఇంకా తమతోనే ఉండాలని బలవంతం చేయడం వారి మూర్ఖత్వమే అవుతుందన్నారు. ఈ డిమాండ్ ఇప్పటికిప్పుడు పుట్టుకు వచ్చింది కాదని గుర్తుచేశారు. 1956లో సీమాంధ్రను హైదరాబాద్ రాష్ట్రంలో కలిపిన మరుక్షణం నుంచే తెలంగాణ వాదులు పోరాటాలు చేస్తూనే ఉన్నారని, ఈ విషయం యావత్ ప్రపంచానికి తెలుసన్నారు. 2000 సంవత్సరంలో వైఎస్ హయంలో 41మంది ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించి సోనియాగాంధీకి లేఖ ఇప్పిస్తే దీనిపై అధ్యయనానికి ప్రణబ్‌ముఖర్జీని చైర్మన్‌గా ఆరుగురు సభ్యుల కమిటీని వేసిందన్నారు. ఆ తర్వాత 2004 అధికారంలోకి వచ్చిన తర్వాత యూపీఏ హయంలో కూడా ప్రణబ్‌ముఖర్జీ అధ్యక్షతన మరో కమిటీని వేశారన్నారు. ఈకమిటీ విశేషంగా కృషిచేసి జాతీయ పార్టీలన్నింటితో లేఖలు సేకరించారని డిఎస్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కాంగ్రెస్ పక్షాన స్వయంగా పరిశోదించిన వ్యక్తి ప్రణబ్‌ముఖర్జీ ఇప్పుడు రాష్ట్రపతిగా ఉండడం తెలంగాణ ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలకు అదృష్టమన్నారు. రాష్ట్రం విడిపోయాక ఇరు ప్రాంతాలకు న్యాయం చేసేందుకు ఆయన చాణక్యతను ప్రదర్శిస్తారన్నారు. రాష్ట్రం విడిపోయే ప్రక్రియ వేగంగా సాగుతున్నా కూడా సీమాంధ్రులు నేడు తప్పటుగులు వేయడం దుర్మార్గమన్నారు. సీమాంధ్రులు, తెలంగాణ వారిచ్చే కోరికల చిట్టాపైన స్టడీ చేసి ఇరు ప్రాంతాలకు లాభం చేకూర్చాలని ఆయన రాష్ట్రపతిని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 1956నుంచి ఉద్యమం కొనసాగుతున్నా కూడా నేటికి అడ్డుకోవడం శోచనీయమన్నారు. తెలంగాణ ఉద్యమం 1969లో తీవ్రంగా జరుగుతుండగానే జైఆంధ్రా ఉద్యమం కూడా కొనసాగిందన్నారు. ఎప్పుడైతే సీమాంధ్రలో తెలంగాణ (హైదరాబాద్ రాష్ట్రాన్ని) కలిపారో ఆనాటినుంచే తెలంగాణ ప్రజలకు మానసిక శాంతి లేకుండా పోయిందన్నారు. హైదరాబాద్ ఇప్పటికి కూడా అందరిదేనని తాము చెపుతున్నామన్నారు. అయితే హక్కులు కావాలనుకోవడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్‌ను చేయాలని కోరడం తెలివితక్కువ తనమే అవుతుందన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలు ఎట్టి పరిస్థితిలోను అంగీరించే పరిస్థితి లేదన్నారు. సీమాంధ్రులు ఇప్పటికే రాష్ట్రపతిని, ప్రధాన మంత్రిని, ¬ంమంత్రితోను కలిసి అన్ని ప్రయత్నాలు చేశారన్నారు. ఇప్పటికైనా వారు కోరుకుంటున్నదేంటో బయట కూడా చెప్పాలన్నారు. లోపలోటి మాట్లాడుతూ బయటకు వచ్చి మరోటి చెపుతున్నారని ఇది దుర్మార్గమైన చర్యే అవుతుందన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల హక్కులను హరించే ప్రయత్నం చేస్తామంటే చూస్తూ ఊరుకునేందుకు తెలంగాణ ప్రజలు సిద్దంగా లేరన్నారు. అవసరమైతే గట్టిగా మరోసారి పోరాడేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. సీమాంధ్రులకు ఏం కావాలో నేడు బిల్లు అసెంబ్లీలో ఉన్నందున అక్కడే చెప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఇదొక్కటే నేడు సరైన వేదికన్నారు. అసెంబ్లీలో చర్చించేందుకు 42 రోజుల గడువు ఇచ్చినా కూడా సీమాంధ్ర నేతలు వినియోగించుకోకుండా వాయిదాలు వేస్తూ మల్లీ సమయం కావాలంటే వినేందుకు పై వాళ్లు మూర్కులుగా అనుకుంటున్నారా అని డీఎస్ సీమాంధ్రులను నిలదీశారు. తెలివి అనేది విూకే ఉందనుకుంటే అది పొరపాటే అవుతుందన్నారు. సీమాంధ్ర ప్రజలకు ఏం కావాలో అసెంబ్లీలో చర్చించి కేంద్రం దృష్టికి, రాష్ట్రపతి దృష్టికి తీసుకు రావాలన్నారు. ఎవ్వరు ఎంతసేపు మాట్లాడుతారో అంతసేపు మాట్లాడాలని డీఎస్ సూచించారు. దొడ్డిదారులు వెతకడం మానుకుని అసెంబ్లీలో చర్చించాలన్నారు. అసెంబ్లీలో ఇప్పటికైనా సుదీర్ఘంగా చర్చించి రాష్ట్రపతికి బిల్లు పంపిస్తే సరిపోతుందన్నారు. తర్వాత నిర్ణయం తీసుకునేందుకు విజ్ఞడైన రాష్ట్రపతి ప్రణబ్ ఉండనే ఉన్నారన్నారు. అసెంబ్లీలో చర్చకు తెలంగాణ వారు సిద్ధంగా ఉన్నారన్నారు. సమగ్ర చర్చ తర్వాత న్యాయమైన నిర్ణయాన్ని రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాష్ట్రపతితో ఏం చర్చించారనే విషయాలు విూడియాకు చెప్పేవి కానే కావన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం త్వరగా ఏర్పాటు చేయాలని మాత్రం కోరినట్లు ఆయన తెలిపారు. ఎన్నికలు కచ్చితంగా రెండు రాష్ట్రాల్లోనే జరుగుతాయన్నారు.
సమైక్యం ముచ్చటేలేదు




