Monday, 2 November 2026

నీరజారావు పోరాటం అభినందనీయం : చంద్రబాబు

హైదరాబాద్‌ : మాఫియాతో పోరాటం అంటే మామూలు విషయం కాదని, నీరజారావు సోరాటాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందించారు. హైకోర్టు ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 2లో కడప మాజీ మేయర్‌ రవీంద్రనాథ్‌ రెడ్డి ఆక్రమించి నిర్మించిన ఇంటిని జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రవీంద్రనాథ్‌ రెడ్డి ఇంటిని పరిశీలించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. వైఎస్‌ వల్ల కడప పేరు వింటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. నగరంలో చాలా చోట్ల ఇలాంటి మాఫియా భూ ఆక్రమణలకు పాల్పడిందన్నారు. తెలుగు దేశం పార్టీ హయాంలో రౌడీలు, గూండాల పేరు వినిపించకుండా చేశామన్నారు. బోర్డులు పెట్టి ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *