హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని ఓ టిఫిన్ సెంటర్‌లో రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. ఈ సంఘటనతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. పేలుడు ధాటికి టిఫిన్ సెంటర్ పూర్తిగా కాలిపోయింది. రోడ్ నెంబర్ ఒకటిలోని సిటీసెంటర్ వద్ద నాలుగు చక్రాల బండిపై ఓ వ్యక్తి టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఉదయం టిఫిన్లు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఒకే సారి రెండు గ్యాస్ సిలిండర్లు పెద్ద శబ్దంతో పేలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుప చేశారు.




