అమీర్‌పేట, హైదరాబాద్ : హైదరాబాద్ యూసుఫ్గూడలోనిస్టేట్ హోమ్ లో ఆశ్రయం పొందుతున్న నలుగురు యువతులు ఈ రోజు ఉదయం పరారయ్యారు. ప్రహరీ గ్రిల్స్ తొలగించి వారు పారిపోయినట్లు తెలిసింది.పారిపోయిన వారిలో ఇద్దరు కోర్టు ఆదేశాల మేరకు స్టేట్ హోమ్‌లో చేరినవారు కాగా, మరో ఇద్దరు అనాథ యువతులు.ఒక యువతి మూడేళ్ల కొడుకుతో సహా వెళ్లిపెయినట్లు తెలిసింది. పకడ్బందీ రక్షణ ఏర్పాట్లను ఛేదించుకుని వీరు పారిపోయినట్లు కేసు నమోదు చేసిన ఎస్ఆర్నగర్ పోలీసులు తెలిపారు.




