Monday, 2 November 2026

గ్యాస్‌ సిలిండర్‌ పేలి దంపతులకు తీవ్ర గాయాలు

కొత్తవలస : విజయనగరం జిల్లా కొత్తవలస పట్టణంలోని ఓ ఇంట్లో ఈ రోజు ఉదయం గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఉదయగిరి సన్యాససిరాజు(32) అతని భార్య నాగమణి(28) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో 108లో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసమైంది. గోడలు బీటలు వారి కూలేందుకు ఇల్లు సిద్ధంగా ఉంది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *