హైదరాబాద్ : ముఖ్యమంత్రితో విభేదించే వాళ్లు మంత్రి వర్గం నుంచి వైదొలికి మాట్లాడాలని మంత్రి టీజీ వెంకటేశ్ అన్నారు. కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీధర్ బాబు శాఖ మార్పు తమకు వ్యతిరేకమనుకుంటే తెలంగాణ మంత్రులు రాజీనామా చేయాలన్నారు. శాసనసభలో సమైక్య తీర్మానం తర్వాతే బిల్లు పై చర్చ జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.




