పాలకొల్లు: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో గురువారం పోలీసులు సమైక్యవాదులను అరెస్టు చేశారు. కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు పర్యటన సందర్భంగా సమైక్యవాదులు ఆందోళనకు దిగుతారని భావించిన పోలీసులు సమైక్యవాదులను ముందస్తుగా అరెస్టు చేశారు.అరెస్టయిన వారిలో ఎమ్మెల్సీ మేళా శేషు బాబు, జి. నాగబాబు, కె.సత్యనారాయణ, డాక్టర్ వర్మ ఉద్యోగ జేఏసీ కన్వీనర్ జి. హరిబాబుతో పాటు దాదాపు 100 మంది సమైక్యవాదులు ఉన్నారు.




