హైదరాబాద్ : సమైక్యానికి ఓటు వేయాలంటూ సంకల్ప దీక్ష చేస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలకు సహకరించని ఇతర సీమాంధ్ర ఎంపీలు, మంత్రులను జాతి ద్రోహులుగా పరిగణించాలని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి అన్నారు. ఆయా మంత్రులు, ఎంపీలకు వ్యతిరేకంగా విశాలాంధ్ర మహాసభ… ప్రజల్లో ప్రచారం నిర్వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. విభజన బిల్లును అడ్డుకునేందుకు ఉన్న ప్రతి అంశాన్ని తాము వినియోగించుకుంటామని తెలిపారు. ఇందిరాపార్క్ వద్ద రెండో రోజు సంకల్ప దీక్షలో కూర్చున్న సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు సబ్బం హరి, లగడపాటి, రాయపాటి, హర్షకుమార్‌లను కలిసి మద్దతు తెలిపిన విశాలాంధ్ర మహాసభ సభ్యులు తదుపరి కార్యాచరణను వెల్లడిస్తామని స్పష్టం చేశారు.




