Wednesday, 4 November 2026

ఆందోళన పర్వం కొనసాగడంతో సభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌ : రెండు సార్లు వాయిదా అనంతరం శాసనసభ తిరిగి ఒకటిన్నర ప్రాంతంలో ప్రారంభమైంది. ఇరుప్రాంతాల సభ్యులు సభిపతి పోడియం వద్ద చేరి నినాదాలు చేశారు. వారిని తమ తమ స్థానాల్లో కూర్చోవలసిందిగా ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క పలుమార్లు విఙ్ఞప్తి చేశారు. తమ పార్టీల సభ్యులను కూర్చోమని చెప్పాల్సిందిగా ఫ్లోర్‌ లీడర్లకకు సేచించారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, వైకాపా అధ్యక్షురాలు విజయమ్మలను వారి పార్టీ సభ్యులకు నచ్చజెప్పాల్సిందిగా ఉపసభాపతి సూచించారు. ముఖ్యమైన బిల్లు పై చర్చ జరపాల్సిఉందని, సహకరించాలని ఆయన ఎన్నిసార్లు కోరినా ఫలితం లేపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు.

ఉదయం నుంచీ కొనసాగిన వాయిదాల పర్వం
శాసనసభలో వాయిదాల పర్వం ఉదయం నుంచి కొనసాగింది. ఈ రోజు ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు క్రపారంభమయ్యాయి. స్పీకర్‌ సభలోకి ప్రవేశించగానే ఇరు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. సభ్యుల ఆందోళనల మధ్యే విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించారు. సభ నిర్వహణకు సహకరించాలని స్పీకర్‌ పదే పదే విఙ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో రెండోసారి సభను అరగంటపాటు వవాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *