Tuesday, 3 November 2026

చర్చ జరిగితే విభజనకు అంగీకరించినట్లు కాదు: అశోక్‌బాబు

హైదరాబాద్‌: సీమాంధ్ర నేతలు విభేదాలు పక్కన పెట్టి బిల్లుపై చర్చకు సహకరించాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు కోరారు. బిల్లుపై చర్చ జరిగితే విభజనకు అంగీకరించినట్లు కాదని , బిల్లుపై చర్చను అడ్డుకోవడం ద్వారా సమైక్యతకు భంగం కలలిగితే పార్టీలదే బాధ్యతని అశోక్‌బాబు పేర్కొన్నారు. ఫిభ్రవరి 10 లోపు సమైక్యవాదానికి అనుకూలంగా గ్రామసభల తీర్మానాలకు రాష్ట్రపతికి పంపుతామని ఆయన చెప్పారు. ఛలో అసెంబ్లీ కార్యక్రమంపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *