హైదరాబాద్ : శాసనసభలో చీఫ్ వివ్ గండ్ర వెంకటరమణారెడ్డి ప్రసంగంపై తెదేపా సభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు అభ్యంతరం చెప్పారు. గండ్ర అబద్ధాలు చెప్తున్నారని, తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తింది వైఎస్ కాదా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, తెరాస కుమ్మక్కై చంద్రబాబును దెబ్బతీసేందుకు కుట్ర చేయలేదా అని ప్రశ్నించారు. తమపై నాయకుడిపై ఆరోపణలు చేసినందుకే వివరణ ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తమ నేత ఇచ్చిన మాటపై వెనక్కి పోలేదని ఎర్రబెల్లి అన్నారు.




