Tuesday, 3 November 2026

మోడీ సీఎం పదవికి రాజీనామా చేయాలి : రాజ్‌ థాకరే

ముంబయి: ప్రధాని అభ్యర్థిగా బరిలో ఉన్న గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ సీఎం పదవికి రాజీనామా చేయాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షులు రాజ్‌ థాకరే అన్నారు. మోడీ ఎక్కడికెళ్లినా గుజరాత్‌ గురించే మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే నయమని, అప్పుడు పూర్తిగా జాతీయ సమస్యలపై దృష్టి పెట్టవచ్చని రాజ్‌ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల ప్రభావం భాజపా, ఎంఎన్‌ఎన్‌ మధ్య సంబంధాల పై పడే అవకాశం ఉందని ఆయా పార్టీల నేతలు భావిస్తునారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *