హైదరాబాద్ : తెరాసను ఉద్దేశించి తెదేపా సభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలపై సభలో మరోసారి గందరగోళం నెలకొంది. దాంతో ఉపసభాపతి మల్లు భట్టు విక్రమార్క సభను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు చీఫ్ వివ్ గండ్ర, తెదేపా నేత ఎర్రబెల్లి మధ్య వాగ్వాదం జరిగింది. పొత్తులు పెట్టుకునే సంప్రదాయం తమ పార్టీకి లేదని గండ్ర పేర్కొన్నారు. తమ నేత ఇచ్చిన మాటపై వెనక్కి పోలేదని ఎర్రబెల్లి అన్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చెందలేదని గండ్ర చెప్పగలరా అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. యనమల స్పీకర్‌గా ఉన్నప్పుడు తెలంగాణ పదాన్ని సభలో నిషేధించింది వాస్తవం కాదా అని తెరాస సభ్యులు హరీశ్ రావు ప్రశ్నించారు. తెరాసను ఉద్దేశించి ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలపై శాసనసభలో గందరగోళం నెలకొంది. తెరాస, తెదేపా తెలంగాణ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గందరగోళం మధ్య ఉప సభాపతి సభను వాయిదా వేశారు.




