Tuesday, 3 November 2026

భాజపాను వదలడం పెద్ద తప్పే : యడ్యూరప్ప

బెంగళూరు: భారతీయ జనతా పార్టీని వదిలి తాను పెద్ద తప్పే చేశారని యడ్యూరప్ప అన్నారు. ఈ రోజు ఆయన తిరిగి భాజపాలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీని వదిలి పొరపాటు చేశానని, గతాన్ని మర్చిపోవాలని, కర్ణాటక జనతాపార్టీకి వెళ్లిన విషయం తానూ మర్చిపపోయానన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేద్దామని, కర్ణాటక నుంచి 20కి పైగా లోక్‌సభ సీట్లు సాధిద్దామని యడ్యూరప్ప పేర్కొన్నారు. అవినీతి ఆరోపణల నుంచి కూడా బయటపడతానని నూటికి నూరు శాతం నమ్మకముందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *