Tuesday, 3 November 2026

దావూద్‌ మా దేశంలో లేడు

పాకిస్తాన్‌ స్పష్టీకరణ

ఇస్లామాబాద్‌, జనవరి 11 (జనంసాక్షి) :

అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం తమ దేశంలో లేడని పాకిస్తాన్‌ స్పష్టం చేసింది. తాము ఇప్పటికే ఈ విషయమై చాలాసార్లు భారత్‌కు సమాధానమిచ్చామని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయ అధికార ప్రతినిధి తస్నీమ్‌ అస్లామ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దావూద్‌ పాకిస్తాన్‌లోని ఉన్నాడని భారత్‌ శుక్రవారం చేసినవి ఆరోపణలేనని ఆయన సమాధానమిచ్చారు. గతేడాది తాను అమెరికాలో అక్కడి ఎఫ్‌బీఐ బాధ్యతలు చూసే అధికారితో సమావేశమైనపుడు దావూద్‌ పట్టుకునేందుకు అమెరికా, భారత్‌లు కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దావూద్‌కు అల్‌ఖైదాతోనూ సంబంధాలున్నాయంటూ అమెరికా అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *