Wednesday, 4 November 2026

‘క్యాట్‌’లో మరోసారి ఇంజనీర్లదే పైచేయి!

హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ప్రవేశానికి ఏటా నిర్వహించే క్యాట్‌ పరీక్షలో ఈ సారీ ఇంజినీర్లే ఉత్తమ ఫలితాలు సాధించి పై చేయిని చాటుకున్నారు. మంగళవారం వెలువడిన క్యాట్‌ ఫలితాల్లో 98శాతం ఆ పైన మార్కులు సాధించి పైచేయిని 3,553 మందిలో 3,276మంది ఇంజనీర్లే. 1.7లక్షల మంది పరీక్ష రాయగా 8 మందికి నూటికి నూరుశాతం  మార్కులు లభించాయి. మరో 17 మందికి 99.99శాతం మార్కులు వచ్చాయి. విజేతల్లో పలువురు రెండోసారి, మూడోసారి క్యాట్‌ పరీక్ష రాజినట్లు తెలుస్తోంది. ఐఐఎం అహ్మదాబాద్‌లో చేరేందుకే వీరు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *