వరంగల్,జనవరి16: పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తరువాత తెలంగాణలో టిడిపి గల్లంతవుతుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. బిజెపిని గ్రాస్థాయి వరకు విస్తరించామన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయమని, మోడీ ప్రధాని కావడం తథ్యమన్నారు.ఈనెల 16,17,18 తేదీల్లో రెండో విడత బూత్ దర్శన్ కార్యక్రమంనిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో 60 శాతం బూత్ కమిటీల వివరాలు జిల్లా పార్టీ కార్యాలయానికి చేరాయన్నారు. కమిటీల ఏర్పాటుతో పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టం చేయనున్నట్లు తెలిపారు. అన్ని పార్టీల నుంచి బిజెపిలోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయన్నారు. ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబు తెలంగాణ బిల్లు ప్రతులను బోగి మంటల్లో కాల్చాలని పిలుపునివ్వటం, ఆ విధంగా వాటిని తగుల పెట్టడం దుర్మార్గమైన చర్య అన్నారు. తెలంగాణ విషయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు, వైఎస్ జగన్ ముగ్గురిదీ ఒకటే విధానమన్నారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగామని చెప్పుకునే నేతలుచిత్తూరు, కడపలో ఎందుకు పోటీ చేస్తున్నారన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పత్రులను సీమాంధ్రా మంత్రులు కాల్చడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. మంత్రి టీజీ వెంకటేశ్ , ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షుడు అశోక్‌బాబు బిల్లు పత్రులను భోగి మంటల్లో కాల్చడం నేరమన్నారు. వీరిపై వెంటనే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తామే పోరాడుతామన్నారు.




