Wednesday, 4 November 2026

జహీరాబాద్‌కు గుర్తింపు తప్పదు

సంగారెడ్డి,జనవరి16: జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా జహీరాబాద్‌ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు రానున్నట్లు జీవ వైవిధ్య మండలి రాష్ట్ర ఛైర్మన్‌ డా.హంపయ్య ప్రకటించారు.ఈనెలాఖరులోగా ఇది సాకారం కానుందన్నారు. చిరుధాన్యాల సంరక్షణకు ప్రస్తుతం మూడో ప్రపంచ యుద్ధ స్థాయిలో ఉద్యమాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రతి రైతు చిరుధాన్యాల ఉత్పత్తిలో ముందుండేలా తాము ప్రోత్సహిస్తున్నామని అన్నారు. అయితే ప్రభుత్వం నుంచి అందుకు తగ్గట్లుగా ప్రోత్సాహం దక్కడం లేదన్నారు. దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే పాత పంటల జాతర అల్గోల్‌లో ప్రారంభమైంది. సంస్థ డైరెక్టర్‌ పీవీ సతీష్‌ ఆధ్వర్యంలో జాతర ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. రైతులు వాణిజ్య పంటల సాగుకు ప్రాముఖ్యం ఇవ్వడంతో జొన్నలు, కొర్రలు, రాగులు, కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. పోషక విలువలు మెండుగా ఉండే చిరుధాన్యాలను విస్మరించొద్దని పిలుపునిచ్చారు. మహిళలు పంటలతో పాటు మొక్కల పెంపకం చేపట్టాలని కోరారు. జాతరలో భాగంగా అల్గోల్‌ గ్రామంలో చిరుధాన్యాలతో అలంకరించిన ఎద్దుల బండ్లను వూరేగించారు. కళాకారుల మాజ్మ, కోలాటం, చిటికెలు, బుర్రకథ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచియాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *