Tuesday, 3 November 2026

కాంగ్రెస్‌ పార్టీ మునుగుతున్న ఓడ లాంటిది: మేనకా గాంధీ

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అంతరించిపోయాందని, ఇప్పుడిక దాన్ని ఏ గాంధీ కూడా కాపాడలేరని భాజపా నే మేనకాగాంధీ అన్నారు. రాహుల్‌ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా కాంగ్రెస్‌ ప్రకటించనుందన్న వార్తల నేపధ్యంలో ఆమె స్పందిస్తూ గత పదేళ్ల కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని దోచేసిందని, ప్రజలెవరూ కాంగ్రెస్‌కు ఒటేయరని, రాహుల్‌గాని ప్రియాంక గాని మునుగుతున్న ఓడలాంటి కాంగ్రెస్‌ను ఇప్పుడు తేల్చలేరని మేనకా గింధీ తీవ్ర స్థాయాలో విమర్శించారు. అవినీతి, కుంభకోణాలు ఆ పార్టీ పరువును భ్రష్టుపట్టించాయన్నారు. రాహుల్‌ గాంధీ భాజపా ప్రధాని అభ్యర్థి మోడికి ఏ మాత్రం పోటీ దారు కాదని మేనకా గాంధీ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *