Tuesday, 3 November 2026

ముఖ్యమంత్రి రేసులో నేను లేను

సర్వే సత్యనారాయణ

హైదరాబాద్‌: కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేసులో తాను లేనని కేంత్ర మంత్రి సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు. కేంద్రంలో రాహుల్‌గాంధీ సారధ్యంలో వచ్చే ప్రభుత్వంలో మంత్రి కావడం పైనే తన దృష్టి ఉందని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను మల్కాజ్‌గిరి స్థానం నుంచే తాను పార్లమెంటుకు పోటీ చేస్తానని తెలిపారు. తెలంగాణ బిల్లు పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, బిల్లు పై నిర్ణయాధికారం పార్లమెంటుకే ఉంటుంది తప్ప అసెంబ్లీ ప్రమేయం నామమాత్రమేనన్నారు. ఇచ్చాన సమయంలో చర్చించకుండా మరింత సమయం కోరండం సరైంది కాదని పేర్కొన్నారు. మమింత సమయం ఇవ్వొద్దని తాను కూడా రాష్ట్రపతిని కోరనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *