ఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి గుణపాఠం చెబుతామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్ అన్నారు. రైల్ భవన్ వద్ద ధర్నాచేస్తున్న ఆయన ఈ రోజు ధర్నాస్ధలిలోనే ఫైళ్లను పరిశీలించారు. ధర్నా వల్ల ప్రభుత్వ పనులకు ఆటంకం కలగదని ఇక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తానని ఆయన స్పష్టం చేశారు.




