ఉత్తరాఖండ్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి 23ఏళ్ల యువతి ఇంటినుంచి తీసుకెళ్లిన ఓ యువకుడు స్నేహితుడితో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు.తర్వాత గొంతుకోసి హత్యచేసి హత్యచేసి శవాన్ని సమీప అడవిలోకి తీసుకెళ్లి దహనం చేసి ఆమె సెల్ ఫోను, నగలతో ఉడాయించారు. డిసెంబరు 30 నుంచి కన్పించ కుండా పోయిన మృతదేహం సగం కాలిన దశలో అడవిలో కన్పించడంతో పోలీపులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.యువతి సెల్ ఫోను ఆధారంగా నిందితులిద్దరినీ అరెస్టు చేశారు.




