ఢిల్లీ: ఢిల్లీలో రైల్ భవన్ వద్ద ధర్నా చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులకు పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. రైసినా రోడ్‌లోని బారికేడ్లను ఆప్ కార్యక్తలు ధ్వంసం చేయగా పోలీసులు వారిపై లాఠీఛార్జీ చేశారు. లాఠీఛార్జిలో పలువురు ఆప్ కార్యకర్తలకు గాయాలైనట్లు సమాచారం.




