కులం కాని వ్యక్తిని ప్రేమించి నందుకు శిక్ష
జరిమాన కట్టలేదని సామూహిక అత్యాచారం
20ఏళ్ల యువతిపై 12 మంది ఆత్యాచారం
హైదరాబాద్: పంచాయతీ ఆదేశాలతో 12 మంది ఒక యువతిపై సాముహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది. భీర్భమ్ జిల్లాలో 20ఏళ్ల యువతి తనకులం కాని వ్యక్తిని ప్రేమించినందుకు పంచాయతి పెద్దలు ఆమెకు జరిమానా విధించారు. ఆ జరిమాన కట్టలేక పోయినందుకు పంచాయతీ ఆదేశంతో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి సంబంధిచిన గ్రామ పెద్దలు 13 మందిని అరెస్టు చేశారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.




