ఉత్తరప్రదేశ్: యూపీలోని గోరఖ్‌పూర్‌లో భాజాపా ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ మరోసారి యూపీఏ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పునరావృతమవుతాయని యోడీ అన్నారు. దేశంలో పేదరికం పెరగడానికి కాంగ్రెస్ అస్తవ్యస్త విధానాలే కారణమన్నారు. తనకు 60 నెలల సమమం ఇవ్వమని సామాన్య ప్రజల జీవితాలు మారుస్తానని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు.




