భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద బస్సు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో పాపికొండలకు వెళుతున్న బెంగుళురుకు చెందిన బస్సు అదుపు తప్పి కొండను ఢీకింది. ఈ ప్రమాదంలో బస్సుతో ప్రయాణిస్తున్న దాదాపు 40 మందికి గాయాలయ్యాయి. క్షతగ్రాతులను వీఆర్‌పురం మండలం రేఖపల్లి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వీరంతా నాలుగు రోజుల కిందట బెంగుళురు నుంచి బయలుదేరారు.




