విశాఖ వన్‌టౌన్ : స్వైన్‌ఫ్లూ లక్షణాలతో బాధపడుతునన ఓ గర్భిణీ విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. విశాఖ నగరంలోని మురళీ నగర్ ప్రాంతానికి చెందిన ఓ గర్భిణికి ఈనెల 15న జ్వరంతో బాధపడుతూ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం లక్షణాలు కనిపించడంతో ఆమెకు వైద్యులు స్వైన్‌ఫ్లూ పరీక్షలు నిర్వహించారు. స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది.




