Tuesday, 3 November 2026

సీఎం నోటీసును తిరస్కరించేవరకు ఆందోళన

హైదరాబాద్‌ : రాష్ట్ర పునర్విభజన ముసాయిదా బిల్లుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన నోటీసును స్పీకర్‌ తిరస్కరించే వరకు ఆందోళన కొనసాగించనున్నట్లు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం తేల్చిచెప్పింది. ముఖ్యమంత్రి నాటకాలఱు ఆడుతున్నారంటూ మండిపింది. సభాపతి ఎవరి ఒత్తిడులకు లొంగవద్దని సూచించింది. సీఎం నోటీసుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. సీఎం నోటీసును తిరస్కరిస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించే వరకు అసెంబ్లీలోని సీ.ఎం. స్పీకర్‌ కార్యాలయాల ముందు నిరసన తెలుపుతూ ఉంటామని ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయారకర్‌ రావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *