Monday, 2 November 2026

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల నెరవేరింది

హైదరాబాద్‌ : రాష్ట్ర పునర్విబజన బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్లాలన్న మా లక్ష్యం నెరవేరిందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ముఖ్యమంత్రి రూపొందించిన నాటకం ముగిసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల నిజం కాబోతోందన్నారు. తెలంగాణ బిల్లు గడువు లోపు రాష్ట్రపతి వద్దకు వెళ్లాలన్న తమ ప్రయత్నం నెరవేరిందన్న ఆయన, రాజకీయ లబ్ధి కోసమే సీఎం ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారని ఆరోపించారు. బంతి, బ్యాట్‌ లేకపోవడమే కాదు, మైదానం కూడా ఖాళీ అయిందని ఉపముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *