పాట్నా: బీహర్‌లోని బేగుసరాయ్ జిల్లా సింఘవుల్ బుధవారం అర్ధరాత్రి ప్రాంతంలో దాదాపు 12 మంది సాయుధ బందిపోట్లు ఒక మహిళను హత్య చేయడంతో పాటు మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరచి, దోపిడికి పాల్పడ్డారు. రాంబాబు సాహ్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడిన ఆగంతకులు రాంబాబు బంధువు రుక్మిణిదేవి, అద్దుకు ఉంటున్న అరవింద్ మహతో, ర్మిశ మహతోలను విచక్షణారహితంగా కొట్టారు. వీరిలో రుక్మిణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం దొంగలు లక్షాలాది రూపాయలు విలువైన సోత్తుతో పరారయ్యారు.




