Monday, 2 November 2026

ఆర్టికల్‌-3 ఓటింగ్‌కు తావులేదు: భట్టి విక్రమార్క

హైదరాబాద్‌: ఆర్టికల్‌-3 ప్రకారం రాష్ట్రానికి వచ్చిన బిల్లుపై ఓటింగ్‌కు తావులేదని డిప్యూటీ స్పీకర్‌ మల్లుభట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ బిల్లుపై కేవలం అభిప్రాయం చెప్పమని మాత్రమే రాష్ట్రపతి రాష్ట్రానికి బిల్లు పంపపారని ఆయన అన్నారు. కేవలం అభిప్రాయం తెలుసుకునే వరకు మాత్రమే పరిమితమని పేర్కొన్నారు. ఆర్టికల్‌-3 ప్రకారమే బిల్లుపై చర్చ ముగిసందని, చర్చల వివరాలను త్వరలో రాష్ట్రపతికి పంపిస్తామని వెల్లడించారు. రూల్‌-77 ప్రకారం జరిగిన తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని స్పష్టం చేశారు. ఈ రూల్‌ శాసనసభ వ్యవహరాలకు సంబంధించింది మాత్రమే అని చెప్పారు. రాష్ట్ర విభజన అంశంపై ఇక్కడ జరిగినంత చర్చ ఉత్తరప్రదేశ్‌, బీహర్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలలో కూడా జరగలేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *